Monday, April 29, 2024

Nizamabad- వికటించిన వైద్యం… బాలుడి మృతి – ..న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించి బాలుడి మృతి చెందారని బంధువుల ఆరోపణ. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మండలం బిజీపూర్ తాండాకు చెందిన నరేష్- వసంత దంపతుల ముద్దుల కుమారుడు మధుసూదన్ (5) సంవత్సరాల బాలుడు అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 3న నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు.. బాలుడు క్షేమంగా ఉన్నాడనీ చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు భరోసా ఇవ్వడంతో ఆ దంపతులు సంతోషించారు…

చికిత్స కొనసాగుతుండగా బాలుడికి అన్నం తినిపిస్తుం డగా ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది..(నర్సు) అర్జెంటుగా వైద్యానికి సంబంధించిన ఇంజక్షన్ ఇవ్వాలని నర్సు తెలుపగా… బాలుడికి అన్నం తిన్న తర్వాత ఇంజక్షన్లు ఇవ్వండి అని చెప్పినా వినకుండా నర్సు.. నా డ్యూటీ టైం అయిపోతుందని నర్స్ వెంటనే బాలుడికి మూడు ఇంజక్షన్లు ఇచ్చింది… ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం బాలుడు అపస్మారాక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయాడంటూ తల్లి రోధిస్తూ ఆరోపించింది.

బాలుడికి వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని డాక్టర్ నీ నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పలేదని ఆరోపించారు.. వెంటనే భాదిత కుటుంబ సభ్యులతో ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి లైసెన్స్ రద్దుచేసి వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాలుడికి అందించిన వైద్యంపై విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని ఆసుపత్రి ఎదుట బంధువులు భీష్ముంచుకొని కూర్చున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement