Friday, May 17, 2024

హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తోంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ హేమ నగర్ రోడ్ నెంబర్ 7లో హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. మెడికల్ స్టూడెంట్ రాధ గత రెండేళ్ల క్రితం మిస్సింగ్ అయ్యింది. విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదైంది. రాధను మావోయిస్టులలోకి చేర్చారని శిల్పపై ఆరోపణలున్నాయి. ఏకకాలంలో ఎన్ఐఏ మూడు చోట్ల సోదాలు చేస్తుంది. పర్వతపురంలోని దేవేంద్ర ఇంట్లో సోదాలు, అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు బండి కిరణ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement