Friday, December 6, 2024

Negligence – చెత్త కుప్ప‌లో ఆధార్, పాన్, ఎటిఎం కార్డులు…14 ఏళ్లుగా పోస్ట్ మాన్ నిర్వాకం ..

వికారాబాద్ – అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. కానీ దాన్ని ఓ పోస్ట్ మ్యాన్ చెత్తలో పడేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్త కుప్పలో వేల సంఖ్యలో ఆధార్, పాన్, లెటర్లు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో నరసింహులు వ్యక్తి పోస్ట్ మాన్ పనిచేస్తున్నాడు. పోస్టాఫీసులకు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వచ్చినవాటన్నింటిని కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు 2011 నుంచి లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను చెత్త కుప్పలో పడేసాడు. దాదాపు 14 సంవత్సారాల ఆదార్, పాన్, ఏటీఎంలు, లెటర్లు అన్నీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయడంతో గ్రామప్రజలు షాక్ తిన్నారు.

గ‌త‌14 ఏళ్లుగా వచ్చినవన్నీ పోస్టాఫీసులో చెత్తలా పేరుకుపోతుండటంతో ఎలాగైనా చెత్తకుప్పలో పడివేయడం మంచిదని భావించాడు. గ్రామపంచాయతీకి కాల్ చేశాడు. దీంతో గ్రామ పంచాయితీ ట్రాక్టర్ అక్కడకు రావడంతో అధార్, పాన్, లెటర్లు, ఏటీఎంలు అన్నీ మూటలో తీసుకుని వచ్చి చెత్తకుప్పలో పారివేయడంతో పోస్ట్ మాన్ భాగోతం వెలుగుచూసింది. కార్యాలయానికి వచ్చినవన్నీ అలాగే పడివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement