Thursday, May 2, 2024

Navy | సాగర్ తీరంలో ఎన్‌సీసీ శిక్షణ తరగతులు.. ఉల్లాసంగా సాగుతున్న సాహ‌స యాత్ర‌

నాగార్జునసాగర్ (ప్రభ న్యూస్): ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ఎన్‌సీసీ నావికాదళాల శిక్షణా తరగతులు తొమ్మిదో రోజుకు చేరుకున్న‌ట్టు చీఫ్ కల్నల్ ఏకే రుషి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ రోజు ఎన్‌సీసీ శిక్షణ శిబిరంలో భాగంగా నాగార్జునసాగర్ కొత్త లాంచి స్టేషన్ దగ్గర్నుండి సాహస యాత్ర నీటి మార్గంలో బూడిదగట్టు తండా, సాగర్ మాత చర్చిలను కలుపుకుంటూ 20 కిలోమీటర్ల మేర విజయవంతంగా జరిగినట్లు తెలిపారు.

తొమ్మిది రోజుల సాహస యాత్రలో మొత్తం 180 కిలోమీటర్ల దూరం కంప్లీట్ అయ్యింద‌ని, మిగతా 30 కిలోమీటర్ల యాత్ర రేపు పూర్తి చేయనున్నట్లు క‌ల్న‌ల్ రుషి తెలిపారు. సాహస యాత్రలో ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు సుమారు 80 మంది పాల్గొంటున్నారు. రేపు కొత్త లాంచి స్టేషన్ నుండి యాత్ర ప్రారంభమై, జెండా పంట వరకు వెళ్లి తిరిగి లాంచి స్టేషన్ వద్దకు 30 కిలోమీటర్లు పూర్తి చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement