Wednesday, September 20, 2023

ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి.. ఇష్టపడి చదవాలి.. ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి

కరీంనగర్ (ప్రభ న్యూస్) విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ట్రినిటీ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని, ఇష్టపడి చదివితే ప్రయోజకులు అవుతారన్నారు. విద్యార్థి దశలో కేవలం చదువుపైనే దృష్టి సారించాలని, ఇతర అలవాట్లకు బానిసలుగా మారితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. మంచి ప్రణాళికతో విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు.

- Advertisement -
   

నారాయణమూర్తి ఆలపించిన పాటలకు విద్యార్థులు శ్రుతి కలిపారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ అధ్యాపకులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement