Monday, April 15, 2024

పార్టీలో చేరే నేతలు పదవులకు రాజీనామా చేసి రావాలి.. కిషన్ రెడ్డి

బీజేపీ పార్టీలో చేరే నేతలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈటల రాజేందర్ సైతం రాజీనామా చేసి పార్టీలో చేరారన్నారు. రేపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారన్నారు. రేపు అమిత్ షా సభ ఉంటే… ఈరోజు టీఆర్ఎస్ సభ ఎందుకు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీది నైతిక విలువలతో కూడిన రాజకీయమని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement