Thursday, May 23, 2024

TS : బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు…

తిరుమలగిరి, ఏప్రిల్ 13 (ప్రభ న్యూస్): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శనివారం వేకువజాము నుంచి వ్యవసాయ మార్కెట్ కు రైతులు ధాన్యం విక్రయించ‌డానికి ధాన్యం ట్రాక్ట‌ర్ల‌తో రైతులు బారులు తీరారు. మార్కెట్లో ధాన్యం పోయడానికి స్థలం లేక ట్రాక్టర్ యజమానులు అస్తవ్యస్తంగా చౌరస్తాలో నిలుపుదల చేయడంతో వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కొని గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు.

వేకువజాము నుంచి నుంచి ట్రాఫిక్ లో వాహ‌నాలు ఇరుక్కోవ‌డంతో నానా అవ‌స్థ‌లుప‌డ్డారు. మార్కెట్‌కు గత మూడు రోజుల నుంచి సెలవులు ఉండడం, శనివారం మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయడం మూలంగా అధికంగా రైతులు ధాన్యం తీసుక‌వ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement