Monday, May 27, 2024

TS : చేవేళ్ల‌కు మాజీ సీఎం… బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న కేసీఆర్‌..

బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల శంఖ‌రావానికి సిద్ధ‌మ‌య్యారు. ఇవాళ్టి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. అందులో భాగంగా నేడు చేవెళ్ల లోక్‌స‌భ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు మ‌ద్ధ‌తుగా నిర్వ‌హించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయ‌న పాల్గొనున్నారు.

- Advertisement -

నేటి సాయంత్రం ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్​ కేసీఆర్, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేసేందుకు చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు స‌న్నాహాలు చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు. ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement