Friday, October 4, 2024

AP : ఇవాళ్టి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

ఇవాళ్టి నుంచి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించ‌నున్నారు. నేటి నుంచి ఎన్డీయే అభ్యర్థుల కోసం రాయలసీమలో విస్తృత ప్రచారం చేయనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరిట ఆయన ఈ యాత్ర నిర్వహించనున్నారు.

- Advertisement -

ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ఓ ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. ఇక ఇవాళ ఉదయం కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు బాలయ్య. ఇక ఏప్రిల్ 19న బాలయ్య హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఏప్రిల్ 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement