Monday, April 29, 2024

National : బోరుబావిలో ప‌డ్డ ఆరేళ్ల బాలుడు.. కొనసాగుతున్న స‌హాయ‌క‌చ‌ర్య‌లు…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆరేళ్ల బాలుడు బోరుబావిలో ప‌డ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. బావి లోపలికి ఆక్సిజన్ పంపిస్తున్నారు. మ‌రో వైపు ప్రొక్లెయిన్లతో బావి చుట్టూ తవ్వుతున్నారు. జిల్లా యంత్రాంగం సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది.

- Advertisement -

ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్‌వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. దాదాపు బోరుబావి 70 అడుగుల లోతులో ఉంది. స్థానికుల సమాచారం మేరకు అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సేవలందిస్తోందని రేవా కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు.

అలాగే పైపు ద్వారా ఆక్సిజన్ లోపలికి సరఫరా చేస్తున్నట్లు అదనపు ఎస్పీ అనిల్ సోంకర్ తెలిపారు. అంతేకాకుండా బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాను కూడా పంపించినట్లు తెలిపారు. కాకపోతే కొన్ని అడ్డంకుల కారణంగా సీసీకెమెరా బాలుడిని చేరుకోలేకపోయిందని చెప్పారు. దాదాపు 70 అడుగుల లోతులో ఉన్న బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నట్లు వెల్లడించారు.

వారణాసి నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాన్ని రప్పించామని.. త్వరగానే బాలుడిని చేరుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అకాల వర్షం కూడా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బంది కలిగించిందని అనిల్ సోంకర్ తెలిపారు. మరోవైపు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంకోవైపు బాలుడి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. క్షేమంగా బయటకు రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement