Sunday, May 5, 2024

మూవీగా చంద్ర‌బాబు నాయుడు బ‌యోపిక్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు జీవిత చరిత్ర లోకనాయకుడు పేరుతో సినిమా తెరకెక్కనుంది. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాట్రైలర్‌ ను గురువారం ఎన్టీఆర్‌ భవన్‌ లో టీటీడీపీఅధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విడుదల చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ ఎన్టీఆర్‌ ట్రస్టులో కేక్‌ కట్‌ చేశారు. అలాగే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సెల్పీ విత్‌ హాష్‌ ట్యాగ్‌ సిబిఎన్‌ డెవెలఫ్‌ తెలంగాణ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జీవిత చరిత్ర భవిష్యత్‌ తరాలకు అందించాలనే సంకల్పంతో లోకనాయకుడు సినిమా రానుందని తెలిపారు. ఈ సీనిమాలో చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేసిన అభివృద్ధి, నవ్యాంధ్రప్రదేశ్‌ లో అప్రజాస్వామిక విధానాలు, ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలు, విద్వేషరాజకీయాలను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు జీవిత చరిత్ర కు చిత్ర రూపం ఇచ్చిన లోకనాయకుడు సినిమా బృందాన్ని ఆయన అభినందించారు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక అభువృద్ధి కార్యక్రమాలు చెపట్టారని తెలిపారు. ప్రజల సమస్యలను తీర్చాలంటే సమర్థవంతమైన నాయకుడు అవసరమనే విషయం చంద్రాబాబు జీవితం స్పష్టం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఒక్కరూ కోటీశ్వరులు కావాలన్నదే చంద్రబాబు అకాంక్షని కాసాని చెప్పారు. 73 సంవత్సరాల వయస్సులో నిరంతరం యువకునిలా పనిచేస్తున్న చంద్రబాబు యువతరానికి ఆదర్శమన్నారు. ప్రతిరోజు ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల అభువృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్‌ 2020 ప్రస్తుతం ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని వివరించారు. పార్టీ నాయకులు బియ్యాని సురేష్‌, అధికార ప్రతినిధి జోత్న, జక్కిలి ఐలయ్య, కందికంటిఅశోక్‌ కుమార్‌, పొగాకు జయరాం చందర్‌ మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభువృద్ధి కార్యక్రమాలు సెల్పీ తీసి సెల్ఫీ విత్‌ హాష్‌ ట్యాగ్‌ చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement