Wednesday, May 1, 2024

BRS MLC: బ‌డ్జెట్ లో సున్నా నిధులిచ్చిన మోదీ మీకు పెద్ద‌న్నా… కవిత

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ సభలో ప్రధాని మోదీని రేవంత్‌ పెద్దన్న అని సంభోదించార‌ని, దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే అని అర్ధం అవుతుంద‌న్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంద‌ని గ‌ళ‌మెత్తారు… ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్‌-3ను వెంటనే రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.. ఈ జీవో ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నా చేస్తామ‌ని చెప్పారు.. 33శాతం రావాల్సిన రిజర్వేషన్ ఈ జీవోతో హరించుకుపోయిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని క‌విత అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement