Sunday, May 26, 2024

TS : మోదీ వెన్నులో వ‌ణుకు పుడుతోంది… మంత్రి పొన్నం

మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని స్వయంగా ప్రధానమంత్రి అనడం విచారకన‌మ‌న్నారు.

- Advertisement -

పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని, ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నార‌న్నారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. మేము అన్నివర్గాలకు న్యాయం చేసే విధంగా పాలించామ‌ని, 80 శాతం ఉన్న హిందువులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందా..? ఏకపక్ష మెజార్టీ మీకు ఇచ్చినా.. మీరు హిందువులకు ఏం చేశారు? అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement