Saturday, October 5, 2024

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండ‌గా ఉంటాం… జగన్

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సీఎంను కలిశారు. కార్మికులతో మాట్లాడిన జగన్ వారికి కీలక హామీలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి కృషి చేస్తున్నామని.. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని తెలిపారు. బీజేపీతో పొత్తుతో స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరి ఏంటో బయపడిందన్నారు. గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మికలోకం చెప్పాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement