Tuesday, April 30, 2024

TS: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి యువకుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బైక్ పై వెళ్తున్న యువకుడు(వర్షిత్ రెడ్డి ) ఒక్కసారిగా అదుపు త‌ప్పి పడటంతో వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు యువకుడిపై నుండి దూసుకు పోయింది.

- Advertisement -

తీవ్ర గాయాలు అవ్వడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులకు కడుపుకోత.. అందరినీ కలిచివేస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement