Saturday, May 18, 2024

24వ తేదీన‌ మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మోడల్‌ స్కూల్స్‌ అడ్మిషన్స్‌ టెస్టు 24వ తేదీన (ఆదివారం) జరగనుంది. ఉదయం ఆరో తరగతి వారికి, మధ్యాహ్నం ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌ 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుంది. ఏడు నుంచి పదో తరతగి ప్రవేశాల కోసం 73,201 మంది దరఖాస్తు చేసుకోగా 75 శాతం మంది ఇప్పటి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement