Friday, April 26, 2024

న‌ల్గొండలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ : 97.01 శాతం నమోదు

నల్గొండ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల కోట MLC ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 97.01శాతం పోలింగ్ నమోదైంది. 1271 మంది ఓట్లకు గాను 1233 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లు నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల‌ సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి అధికారులు సీల్ వేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడoచల భద్రతా వ్యవస్థతో పాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈనెల 14న మహిళా సమాఖ్య భవనంలోనే కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ‌కుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement