Tuesday, May 21, 2024

డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేసిన.. ఎమ్మెల్సీ బండ ప్ర‌కాష్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ బండ ప్రకాష్. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు.. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..మంత్రులు కెటిఆర్,హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, మహమూద్ అలీలతో కలిసి సమర్పించారు ఎమ్మెల్సీ బండ ప్రకాష్.ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు మధుసూదనచారి,వి.జి గౌడ్,తాత మధు,ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,బిఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement