Friday, May 17, 2024

Missing కరీంనగర్ లో చిన్నారి మిస్సింగ్ కలకలం

కరీంనగర్ నగరంలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది మూడు రోజులుగా చిన్నారి కృతిక(3) కనిపించకుండా పోవడంతో కన్నీరుమున్నీరు గా విలపిస్తున్న తల్లిదండ్రులు. కూలి పనుల కోసం కరీంనగర్ నగరానికి మధ్యప్రదేశ్‌ నుండి వ‌చ్చారు యస్వంత కార్వే సబితా కార్వే దంప‌తులు.. వారు శ్రీ హరి నగర్ కాలనీ లో నివాసం ఉంటున్నారు. ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళిన చిన్నారి కృతిక కనిపించక పోవడంతో కరీంనగర్ టూటౌన్ లో చిన్నారి కనబడడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

భారీ వర్షాలు కురవడం తో పాప మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు చుట్టుపక్కల నాలలో వేదికారు. సి సి ఫుటేజీలో కొంచం దూరం వెళ్లినట్టు కబిపించింది. పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement