Monday, April 29, 2024

Miriyalaguda సాగర్ ఆయకట్టులో లిఫ్ట్ లను నడిపి పంటలను కాపాడండి – జగదీష్ రెడ్డి

సాగర్ ఆయకట్టులో వెంటనే లిఫ్ట్ లను నడిపించి ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో మీడియా సమావేశంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి, ఎడమ కాలువ పరిధిలోలిఫ్టులు, తూముల ద్వార యుద్ధ ప్రాతిపదికన చెరువులను నింపాలన్నారు. నీరు లేక ఎండిపోతున్న లక్షల ఎకరాల పండ్ల తోటలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సాగర్ జలాశయంలో నీరు ఉన్నా, వాటిని ఉపయోగించుకోకుండా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా నీళ్లు ఇవ్వకుండా రైతుల పొలాలను ఎండబెట్టిందన్నారు. కాళేశ్వరం పైచెడు ప్రచారం చేసి, విధి లేని పరిస్థితుల్లో నిన్న మొన్న మోటార్లను ఆన్ చేసి హడావుడిగా నీళ్లు వదిలారని,అప్పటికే పొలాలన్నీ నిలువైన ఎండిపోవడం తో లాభం లేకుండా పోయిందన్నారు.

ప్రతిపక్ష పార్టీగా రైతుల తరఫున పోరాటం మొదలుపెట్టాం అన్న జగదీష్ రెడ్డి, స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారన్నారు..ప్రభుత్వం మెడలు వంచేదాకా మా పోరాటం ఆగదన్నారు.. రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్ష చేస్తున్నాం అన్నారు.ఎస్ ఎల్ బి సి కింద కూడా నీటి విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని సద్వినియోగం చేసుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

మూర్ఖత్వంతో ,అవగాహన రాయిత్యంతో నిర్లక్ష్యంతో పాలన చేస్తున్నారని విమర్శించారు..కరెంటును కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్న జగదీష్ రెడ్డి,.

కరెంటు నిర్వహణ లేకపోవడంతో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.ఎంతసేపు దోచుకోవడం పైనే సీఎంకు మంత్రులకు ధ్యాస ఉన్నదని మండిపడ్డారు.. నెలలో సగం రోజులు సీఎం ఢిల్లీలో ఉంటున్నారని,సామంత రాజు లాగా ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో పశుపక్షాదులు తాగునీరు లేక అల్లాడుతున్నా, జిల్లా మంత్రులకు కనీస బాధ్యత లేదన్నారు. అసలు జిల్లా మంత్రులు ఉన్నారా లేదో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

జిల్లా మంత్రులకు సిగ్గులేదు, రైతులు చస్తున్నా పట్టింపు లేదన్నారు. జిల్లా మంత్రులు అక్రమ దందాలపైనే బిజీగా ఉన్నారని ఫైరయ్యారు.జిల్లా మంత్రులు ఇద్దరు చేతకానివారని, ఒక్కరికీ కూడా పాలనపై పట్టు లేదని. ప్రజలంటే లెక్క లేదన్నారు. రైతుల సమస్యలపై రేపు బిఆర్ఎస్ తలపెట్టే దీక్షలలో పెద్ద ఎత్తున బిఆర్ శ్రేణులు పాల్గొని రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement