Sunday, May 5, 2024

TS: సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్, ఆగస్టు 18, ప్రభ న్యూస్ : సర్దార్ సర్వార్ పాపయ్య గౌడ్ జయంతి పురస్కరించుకొని మీర్ పేట్ కార్పొరేషన్ లోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాల్లో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కోకాపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. అదేవిధంగా రైతన్నల లాగే, గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గీయకుండా, గౌడ్స్ కు ఇబ్బంది లేకుండా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు. ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు. కులవృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని, నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు. బీసీల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్స్ పోరేడి పద్మ భాస్కర్ రెడ్డి, సిద్ధాల లావణ్య, బీరప్ప, అక్కి మాధవి, ఈశ్వర్ గౌడ్, బోక్క రాజేందర్ రెడ్డి, ఊయల నవీన్ గౌడ్, అనిల్ కుమార్, ధనలక్ష్మి, రాజ్ కుమార్, ఇంద్రవతి, రవి నాయక్, బైగాల బాలమణి రామచంద్రయ్య, దిండు భూపేష్ గౌడ్, పంతంగి మాధవి, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement