Monday, April 15, 2024

HYD : పార్కులు, చెరువులు కబ్జా చేసింది మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులే.. శ్రీరాములు యాదవ్

బడంగ్ పేట కార్పొరేషన్ నుంచి వసూలు చేసే ఇంటి పన్నులు, నల్లా బిల్లులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు దుయ్యాబ‌ట్టారు. ఇవాళ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అల్మాస్ గూడలో పలుకాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ అభ్యర్థి సబితమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇద్దరూ… వలస వచ్చారు భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తారో చెప్పలేమని విమర్శించారు.

ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ… మన పన్నుల డబ్బులు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు తరలిస్తుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోరు మెదపటం లేదని విమర్శించారు. అల్మాస్ గూడలో చెరువులు, పార్కులు కబ్జా చేసింది సబితమ్మ అనుచరులేనని ఆరోపించారు. రాజీవ్ గృహకల్ప ఇడ్ల రుణాలు మాఫీ చేస్తామని చేయలేదన్నారు. 60 గజాల ఇళ్ల పట్టాలు ఇస్తామని, గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని ఏండ్లు గడుస్తున్నా.. మంత్రి సబితా ఇప్పటికీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ ఐలయ్య యాదవ్, రామిడి మాధురి వీరకర్ణారెడ్డి, దడిగ శంకర్, శూరకర్ణారెడ్డి, తోట శ్రీధర్ రెడ్డి, శివారెడ్డి, జంగారెడ్డి, జంగాచారి, శశిధర్ రెడ్డి, రవికాంత్, రవితేజ, మల్లికార్జున్, మల్లేష్ సహా బీజేపీ, బీజేవైఎం అన్ని మోర్చాల నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement