Saturday, April 27, 2024

TS : సమ్మక్క జాతరలో మంత్రి….బంగారం స‌మ‌ర్పించిన పొన్నం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాత‌ర‌లో బీసీ, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పాల్గొన్నారు. అమ్మ‌వారిని దర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా అమ్మ‌వారికి బంగారం స‌మ‌ర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం కూలి పోతుందని కొన్ని రాజకీయ పార్టీలు ప్రగల్బాలు మాట్లాడుతున్నారని సమ్మక్క సారక్క అండతో మా ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామన్నారు.ఆయ‌న వెంట మనకొండురు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement