Sunday, February 25, 2024

MLC ELECTIONS: సిరిసిల్లలో ఓటేసిన కేటీఆర్

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. మొత్తం 1324 మంది ఓటర్లు ఉన్నారు.

ఇక, ఉమ్మడి నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూర్యాపేట లోని  పోలింగ్ కేంద్రంలో ఎక్స్ అఫిషియో సభ్యులు హోదాలో మంత్ర జగదీష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement