Wednesday, May 8, 2024

RR :మంత్రి కేటీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి… జాతీయ ఉత్తమ జీపీ సర్పంచ్ నరసింహారెడ్డి

వికారాబాద్, నవంబర్ 16 ( ప్రభ న్యూస్): శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల వికారాబాద్ మర్పల్లి లో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, జాతీయా ఉత్తమ గ్రామపంచాయతీ చీమలదరి సర్పంచ్ నాసంపల్లి నరసింహారెడ్డి కోరారు.

చేవేళ్ల‌ ఎంపీ రంజిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ రోడ్ షోలలో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొంటారని తెలిపారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరై ఈ రోడ్షోలను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement