Friday, May 3, 2024

Kedarnath : జ్యోతిర్లింగ క్షేత్రం మూసివేత

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఛార్‌దామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం మూసివేశారు. మంచు కప్పేయడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మంచు కప్పేసింది. భారీగా మంచు కురియనున్న నేపథ్యంలో ఇప్పటికే కేదార్‌నాథ్‌లోని చార్‌ధామ్‌గా పిలిచే బద్రినాథ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తాత్కాలికంగా మూసేశారు.

ఎముకలు కొరికే చలి ఉండడంతో భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వేద పండితుల మంత్రాల మధ్య ఆలయ మహా ద్వారాన్ని ఉదయం 8.30 గంటలకు మూశారు. పంచముఖి డోలీలో కేథార్ నాథుడుని ఆయన పండితులు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వరా ఆలయానికి తీసుకెళ్లారు. వచ్చే 6 నెలల పాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement