Friday, April 26, 2024

KTR Tweet: కందికొండ కుటుంబానికి అండగా ఉంటానన్న కేటీఆర్‌

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. తమ కుటుంబ పరిస్థితి వివరిస్తూ కందికొండ కుమార్తె మాతృక చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గతంలో క్యాన్సర్​తో తీవ్ర అనారోగ్యానికి గురైన కందికొండకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆర్థికపరమైన అవసరాలకు కేటీఆర్ ఆదుకున్నారు. కందికొండ ఇంటి విషయమై తమ సిబ్బంది మాట్లాడతారని, వారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సమన్వయం చేస్తారని తెలిపారు.

క్యాన్సర్ నుంచి కోలుకుని చికిత్స పొందుతున్న గేయ రచయిత కందికొండకు ఇంటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. మోతీనగర్​లో ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఒత్తిడి తెస్తుండటంతో కందికొండ కుమార్తె కేటీఆర్​కు లేఖ రాశారు. చిత్రపురి కాలనీలో నివాసం కల్పించాలని కోరారు. మాతృక లేఖపై స్పందించిన కేటీఆర్… కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని, మంత్రి తలసానితో తన కార్యాలయ సిబ్బంది సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement