Tuesday, May 7, 2024

పోచమ్మ గుడి నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ

ఆధునీక రంగంలో కూడ గ్రామ దేవతలను కొలిచి హిందు సంస్కృతి సంప్రదాయాలను బావి తరానికి చాటి చెప్పాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 23వ డివిజన్ సుభాష్ నగర్ లో మేయర్ సునిల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్తో కలిసి పొచమ్మ తల్లి దేవాలయం నిర్మాణం, కంపోండ్ వాల్, బోర్ వెల్ ఏర్పాటు కోసం మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. గ్రామ దేవత పోచమ్మను దర్శించుకొని… ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికులు, డివిజన్ ప్రజలతో మంత్రిి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు ఆలయ అభివృద్ది విషయంలో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కరీంనగర్ నగరాన్ని కుల మతాలకు అతీతంగా అభివృద్ది చేసుకోవాలన్నారు. నగరంలో ఉన్న అన్ని మతాల సంస్కృతులను గౌరవించాలన్నారు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కరీంనగర్ నగరం రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. కోతిరాంపూర్ పోచమ్మ దేవాలయంతో పాటు సుభాష్ నగర్ పోచమ్మ దేవాలయాన్ని కూడ అభివృద్ది చేస్తామన్నారు. ఆలయం అభివృద్ది 24 లక్షల కేటాయించిన మేయర్ సునిల్ రావుతో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసిఆర్ కరీంనగర్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement