Saturday, May 4, 2024

తానా సభలకు మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా రావలసిందిగా ఆ సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆహ్వానించింది. శుక్రవారం తానా సభ్యుల బృందం హైదరాబాదులోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలైలో నిర్వహించనున్న 23వ తానా మహాసభలకు మంత్రిని ముఖ్యఅతిథిగా ఆ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఇందుకు మంత్రి ఆ ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement