Friday, October 11, 2024

TS | మంత్రి ఎర్ర‌బెల్లి వెళ్తున్న హెలికాప్ట‌ర్‌కు త‌ప్పిన ప్ర‌మాదం.. యాదాద్రిలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. ఆదివారం మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో వెళ్లుండ‌గా ఇంధనం ఖాళీ అవడంతో యాదాద్రిలోని పెద్దగుట్టపై ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు పైలట్‌. ఇంధ‌నం ఖాళీ అయిన విషయం గుర్తించిన పైలట్‌ యాదగిరిగుట్ట టెంపుల్‌ సిటీ హెలీప్యాడ్‌ వద్ద హెలికాప్టర్‌ను అత్యవసరం ల్యాండ్‌ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిన‌ట్టు తెలుస్తోంది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్‌లో ఇంధనం తీసుకొచ్చి హెలికాప్టర్‌లో ఫిల్ చేశారు. ఆ త‌ర్వాత హెలికాప్టర్‌ హైదరాబాద్‌కు పయనమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement