Tuesday, April 23, 2024

Telecom | 5జీతో సంపద సృష్టి.. భారత కంపెనీల అంచనా

మన దేశంలో క్రమంగా 5జీ సర్వీస్‌లు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఉన్న మూడు ప్రైవేట్‌ టెలికం ఆపరేటర్లు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. ప్రధానంగా రిలయన్స్‌ జియో, ఎయిర్‌ టెల్‌ ఈ విషయంలో పోటీ పడి దేశవ్యాప్తంగా 5జీ సర్వీస్‌లు అందించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. త్వరలోనే ఈ రేస్‌లో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చేరే అవకాశం ఉంది.

5జీ టెలికం సర్వీస్‌ల రాకతో ఉద్యోగుల పనితీరులో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని భారతీయ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. భారత్‌లో టెక్‌ రంగంలో సంపద సృష్టికి భారీ అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నివేదిక వెల్లడించింది. ఉద్యోగాల సృష్టి నైపుణ్యాల అభివృద్ధి పరంగా 5జీ టెక్నాలజీ నుంచి ఐటీ, బ్యాంకిఇంగ్‌, ఆర్ధిక సేవల రంగాల లద్ధి పొందుతాయని 80 శాతానికి పైగా అభిప్రాయపడ్డారు. ఇండియాస్‌ 5జీ రోల్‌ఔట్‌, రెవల్యూషనైజింగ్‌ ది పీపుల్‌ సప్లై చెయిన్‌ పేరిట టీమ్‌లీజ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఉద్యోగ విపణి, ఉపాధి కల్పన మీద 5జీ ప్రభావంపై 247కు పైగా కంపెనీలు స్పందనలు తెలిపాయి.

- Advertisement -

నివేదికలోని అంశాలు…

5జీ సాంకేతికతతో బీఎఫ్‌ఎస్‌ఐ 80 శాతం, విద్య 48 శాతం, గేమింగ్‌ 48 శాతం, రిటైల్‌, ఇ-కామర్స్‌ 46 శాతం వంటి రంగాలపై గణనీయమైన ప్రభావం ఉండనుంది. 5జీ ప్రారంభించిన ఏడాదిలోపే 61 శాతం ఉద్యోగాల సృష్టి ఉంటుందని 46 శాతం మంది భావిస్తున్నారు. టెలికం రంగానికి పీఎల్‌ఐ పథకం కింద 12,000 కోట్ల కేటాయించారు. కొత్త ఉద్యోగాల సృష్టికి ఇందులో దాదాపు 25 శాతం వెచ్చించనున్నారు. దీంతో ఉద్యోగాల సృష్టి నైపుణ్యాల వృద్ధిపై సానుకూల వైఖరితో ఉన్నామని, భారీగా ఉద్యోగ అవకావాలు, వినూత్నత వల్ల భవిష్యత్‌లో గణనీయమైన మార్పులు తెచ్చే సత్తా 5జీకి ఉందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీఈఓ కార్తీక్‌ నారాయణ్‌ తెలిపారు.

ప్రస్తుతం 5జీ సొల్యూషన్‌ల కోసం టెలికం కంపెనీలు చూస్తున్నాయని, నెట్‌వర్క్‌ ఆప్‌గ్రేడేషన్‌, మైగ్రేషన్‌, ఐఓటీ, ఐఐఓటీ, మొబిలిటీ, నెట్‌వర్క్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ వంటి వాటి వల్ల నియామకాలు పెరిగే అవకాశం ఉందన్నారు. టెక్నికల్‌ కంటెంట్‌ రైటర్స్‌, నెట్‌వర్కింగ్‌ ఇంజినీర్లు, ఏఐ, ఎంఎస్‌ నిపుణులు, యూఎక్స్‌ డిజైనర్లు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇంజినీర్‌లు, సైబర్‌ భద్రతా నిపుణులు, డేటా సైన్స్‌ అనలిటికల్‌ నిపుణులు వంటి ఉద్యోగాలకు గిరాకీ ఉంటుందని నివేదిక పేర్కొంది.

టెలికం పరిశ్రమ 28 శాతం డిమాండ్‌- సరఫరా అంతరాన్ని ఎదుర్కొంటోంది. దీంతో నైనుణ్యాల పెంపు చాలా కీలకం కానుంది. ప్రస్తుత నౖౖెపుణ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని 83 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారు. 11.2 శాతం మంది ఉద్యోగులు నైపుణ్యాల మెరుగుదలకు మొగ్గు చూపారు. 5జీ సేవల ప్రారంభంతో వచ్చే మూడేళ్లలో సృష్టిపై 80 శాతానికిపైగా ప్రభావం ఉంటుందని 41 శాతం మంది వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement