Wednesday, February 28, 2024

MLC Election: ఓటేసిన మంత్రి అల్లోల

నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని అన్నారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు నిర్మల్ జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ లో జడ్పీ కార్యాలయం, బైంసాలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 253 ఓట్లు ఉండగా.. నిర్మల్ లో 151, బైంసాలో 102 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement