Monday, April 29, 2024

తెలంగాణ‌లోని పలు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్..

గ‌త రెండు రోజుల నుండి తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 41–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ప‌లు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావ‌ర‌ణ‌శాఖ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement