Wednesday, October 16, 2024

Medical – వ‌ర‌వ‌ర‌రావుకి ఊర‌ట … ఐ స‌ర్జ‌రీ కోసం హైద‌రాబాద్ వెళ్లేందుకు అనుమ‌తి…

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త వరవరరావు సర్జరీ కోసం హైదరాబాద్‌ వెళ్లేందుకు ముంబయి కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు జడ్జి రాజేష్‌ కఠారియా ఆదేశాలు జారీ చేశారు. ఎడమ కన్నుకి సర్జరీ కోసం డిసెంబర్‌ 5 -11 తేదీల మధ్య హైదరాబాద్‌ వెళ్లవచ్చని, తన ప్రయాణ వివరాలను డిసెంబర్‌ 4న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఆయన నివసించే ప్రాంతం, కాంటాక్ట్‌ నెంబర్‌లను కూడా ఇవ్వాలని కోర్టు తెలిపింది.ఎల్గర్‌ పరిషద్‌- మావోయిస్ట్‌ లింక్‌ కేసులో సామాజిక కార్యకర్త వరవరరావు సహా పలువురిని 2018లో ఎన్‌ఐఎ అక్రమంగా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న వారి క‌స్ట‌డీలోనే ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement