Tuesday, February 13, 2024

Revanth Reddy: సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ముగిసింది. అయితే కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతోంది.

రేవంత్ రెడ్డి సైతం గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ… తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవ‌కుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement