Friday, December 6, 2024

ఆ ప‌ని ఎందుకు చేస్తున్న‌వ్.. ప్ర‌శ్నించ‌డంతో ఇద్ద‌రు సూసైడ్‌..

హవేళిఘనపూర్‌, (ప్రభ న్యూస్‌) : అక్రమ సంబంధం ఇద్ద‌రిని పొట్ట‌న‌పెట్టుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్ద‌రు మెద‌క్ జిల్లాలోని హ‌వేళి ఘ‌న‌పూర్ మండలంలోని పోచారం డ్యామ్‌లో దూకి సూసైడ్ చేసుకున్నారు. కాగా, వీరి మృత‌దేహాలు ఇవ్వాల బ‌య‌ట‌ప‌డ్డాయి. హవేళిఘనపురం ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల సంతోష్‌ (30) అదే గ్రామానికి చెందిన దారబోయిన రాణవ్వ (29) ఇద్దరు కలిసి పోచారం డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కత్తుల సంతోష్‌, రాణవ్వ ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేసుకుంటున్నారు. మృతుడి భార్యకి విష‌యం తెలిసి అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావ‌ని ప్ర‌శ్నించ‌డంతో గొడ‌వ‌లు అయ్యాయి. దీంతో దారబోయిన రాణవ్వ, కత్తుల సంతోష్ పోచారం డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి పెంటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement