Saturday, March 2, 2024

MDK: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ. 50వేల ఫైన్… సీపీ శ్వేత

హుస్నాబాద్, నవంబర్ 22 (ప్రభ న్యూస్): బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన జక్కని సాగర్ (43) కు రూ.50వేల జరిమానా విధించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) ఎన్.శ్వేత తెలిపారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన జక్కని సాగర్ గత కొంతకాలంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా బెల్ట్ షాపు నడుపుతున్నట్లు సమాచారం రావడంతో హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ అరెస్టు చేసి, గత నెల 13న హుస్నాబాద్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని సూచించినా నేరస్తుడి ప్రవర్తన నియమావళి మార్చుకోకుండా మళ్లీ బెల్ట్ షాప్ నడుపుతుండడంతో నేరస్తున్ని బుధవారం అరెస్టు చేసి తహసీల్దార్ ఎదుట హాజరు పరిచినట్లు ఆమె తెలిపారు.

తహసీల్దార్ విచారణ జరిపి నేరస్తుడికి రూ.50 జరిమానా లేదా 6నెలల జైలు శిక్ష విధించడంతో నేరస్తుడు రూ.50వేల జరిమానా చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నేరస్తులు, చెడు ప్రవర్తన గలవారు రౌడీలు, కేడీలు, డీసీలు, సస్పెక్ట్ మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. వివిధ కేసుల్లో బైండోవర్ చేయబడిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement