Monday, May 6, 2024

పట్టణ ప్రగతి ద్వారా శరవేగంగా అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే జీఎంఆర్

ప‌టాన్ చెరు : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప‌టాన్ చెరు డివిజన్ పరిధిలో లో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీవాసులకు పట్టణ ప్రగతి ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన పట్టణ ప్రగతి 18వ తేదీ వరకు 15 రోజులపాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమం ద్వారా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం తో పాటు, గతంలో నాటిన మొక్కల సంరక్షణ కు తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకోవడంతోపాటు తడి పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నేరుగా ప్రజలతో చర్చించి పనులన్ రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, కాలనీవాసులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement