Friday, October 4, 2024

Patancheru – బోనాల ఉత్సవాల‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్చెరు గోనెమ్మబస్తీలోని దేవాలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ముదిరాజ్ భవన్ సమీపంలో పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాలలో కూడా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈ సందర్భంగా బోనాల మహోత్సవ నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ ని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల వద్ద బోనాల మహోత్సవానికి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు పండుగలకు అధికార హోదా కల్పించడంతోనే ఇది సాధ్యమైంది అని అన్నారు,.

మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను బోనం ఎత్తుకున్న మహిళలందరూ దీవించాలని ఆయన కోరారు మరిన్ని సంక్షేమాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉండే ముఖ్యమంత్రి గా కెసిఆర్ కే చెల్లిందన్నారు. అందువల్ల మరోసారి బీఆర్ఎస్ ను ప్రజలందరూ దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరీ నర్సింలు, మెట్టు కృష్ణ,తులసి దాస్, అశోక్, మేకల రాజు,మనోజ్, సందీప్,రాజు, రమేష్,నవీన్, జాతర నిర్వాహకులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement