Wednesday, May 1, 2024

జ‌ర్మ‌నీలో ఉద్యోగావ‌కాశాలు..

సంగారెడ్డి : జర్మనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్/సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, కన్సల్టెంట్లు, ఈఆర్పి మరియు ఐటి – సపోర్ట్ తదితర ఉద్యోగాల కోసం అర్హత గల అభ్యర్థులు టామ్ కామ్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు సంబంధిత రంగంలో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. గ్రాడ్యుయేట్ విద్యార్హతతో పాటు జర్మన్ భాషలో ప్రావీణ్యత గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు టామ్ కామ్ వెబ్ సైట్ లేదా మోబైల్ యాప్ లో నమోదు చేసుకోవాలని, లేదా తమ రెజ్యుమ్ ను tomcom.itcordinator @gmail.com కు ఈ మెయిల్ చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి అర్హుత గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement