Saturday, May 4, 2024

Election – క‌ర్నాట‌క నుంచి కాంగ్రెస్ కు వంద‌ల కోట్లు …. ఎన్ని కోట్లు పంచినా గెలుపు మాదే…హ‌రీష్ రావు…

మెదక్‌: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయిలు ఓట‌ర్ల‌కు పంచి గెలువాల‌ని చూస్తున్న‌దని, అయినా ఎన్ని కోట్లు పంచినా బిఆర్ఎస్ గెలుపును ఆప‌లేర‌ని మంత్రి హారీష్ రావు అన్నారు.. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ నేత ఇంటిలో తెలంగాణ‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్న రూ 42 కోట్లు ఐటికి స్వాధీనం చేసుకున్న నేప‌థ్యంలో ఆయ‌న మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణకు చేరవేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన అంబికా పతి, ఆయన భార్య అశ్వత్త ఇంట్లో రూ.42 కోట్లు పట్టుబడ్డాయన్నారు.


కర్ణాటకలో గతంలో అధికారంలో భాజపా కాంట్రాక్టర్‌ల దగ్గర 40 శాతం కమీషన్ వసూలు చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 50 శాతం వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్‌గా మారిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో టికెట్‌లు అమ్ముకొంటున్నట్టు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇంకా ఏమన్నారంటే …. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువు.. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదు..కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఓ SFT కి 75 రూపాయల డబ్బులు కట్టాలి. ..కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ. బెంగళూరు వయా చెన్నై కొంత హైదరాబాద్ కి కూడా డబ్బులు చేరాయి. కొంత మంది బిల్డర్లకు డబ్బులు వచ్చాయని తెలిసింది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తానని అనుకోవడం ఓ పగటి కల. కాంగ్రెస్ లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్.. అంటూ హారీష్ వ్యాఖ్యానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement