Thursday, April 25, 2024

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం..

రాయపోల్‌ : రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతుధర పొందాలని ఎంపీపీ కల్లూరి అనితశ్రీనివాస్‌, జడ్పీటీసీ లింగాయిపల్లి యాదగిరిలు అన్నారు. రాయపోల్‌ మండలంలోని కొత్తపల్లి, లింగారెడ్డిపల్లి, టెంకంపేట, గొల్లపల్లి, రామారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని అన్నారు. రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అన్నదాతలు అధైర్యపడవద్దన్నారు. రైతులు పంటను కోసిన వెంటనే ధాన్యాన్ని పొలాల వద్దనే ఆరబెట్టుకొని కొనుగోలుకేంద్రాలకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ఎ-గ్రేడ్‌ వరిధాన్యంకు రూ.1888, బీ-గ్రేడ్‌కు రూ.1868 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలుకేంద్రాల వద్ద తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబందు సమితి మండల అధ్యక్షుడు రేకుల నర్సింహ్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్త, వైస్‌ ఎంపీపీ చెరుకు రాజిరెడ్డి, ఎంపీడీఓ రాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్‌, ఏఓ వెంకటరమణి, ఎంపీఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు మన్నె రంగమ్మ, అమృతబాయ్‌, సత్తెమ్మయాదగిరి, శేకమ్మకనకయ్య, సరోజహన్మంతు, ఉపసర్పంచ్‌ మౌనికబీరయ్య, మండల నాయకులు షాదుల్లా, సీసీలు, వీఓఏలు, మహిళా సంఘాల అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement