Sunday, December 4, 2022

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి..

ప‌టాన్ చెరు : గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన పటాన్ రువు మండలం రుద్రారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జింక రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఇలా రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంటుందని స్థానికులు, జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఈ అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వగా సంగారెడ్డి నుండి ఫారెస్ట్ అధికారులు వచ్చి జింకను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement