Sunday, April 28, 2024

చెరువును తలపిస్తున్న చేర్యాల బస్టాండ్..

చేర్యాల: గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేర్యాల కొత్త బస్టాండ్ పూర్తిగా నిండిపోయి చెరువును తలపిస్తున్నది. బస్టాండ్ ఆవరణలో ఎక్కడికక్కడ గుంతలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో ఈ వర్షాలకు చెత్త మొత్తం మురిగి కంపు కొడుతుంది. బస్టాండ్ లోకి చేరిన వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎలాంటి కాలువ లేకపోవడంతో ఆ వర్షపు నీరు అక్కడే గత వారం రోజుల నుండి నిలిచిపోయి ఉన్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకుండా తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి సంవత్సరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో బస్టాండ్ ఆవరణ చుట్టూ నామమాత్రంగా పనులు చేస్తూ మున్సిపల్ అధికారులు చేతివాటం చూపిస్తూ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువులా మారిన బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement