Tuesday, November 12, 2024

TS : మహంకాళి అమ్మవారి సేవ‌లో బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్‌: మెద‌క్ పార్ల‌మెంట్ బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు చేగుంట‌లో ప‌ర్య‌టించారు. చేగుంట‌లోని మ‌హాంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య పూజారులు ర‌ఘునంద‌న్‌రావుకు వేద ఆశీర్చ‌న‌లు అందించి అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలను అంద‌జేశారు.

ఎంపీ అభ్య‌ర్థిగా ఎంపికై మొద‌టి సారిగా చేగుంట‌కు వ‌చ్చిన ర‌ఘునంద‌న్‌రావుకు బీజేపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈసంద‌ర్భంగా ఆయ‌నకు బీజేపీ శ్రేణులు శాలువా పూల‌మాల‌లో స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. బీజేపీ పార్టీ గెలుపు కోసం కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు సైనికులుగా ప‌నిచేయాల‌ని ర‌ఘునంద‌న్‌రావు పేర్కొన్నారు. మూడోసారి కూడా బీజేపీ కేంద్రం అధికారంలో వ‌స్తుంద‌న్నారు. త‌న‌కు ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినందుకు బీజేపీ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement