Sunday, February 18, 2024

TS | కలకలం సృష్టిస్తున్న వరుస చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు!

గుమ్మడిదల (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి దేవాలయాల్లో దుండగులు చోరీకి పాల్పడగా.. తాజాగా మండల కేంద్రం పరిధిలోని రామ్ నగర్ కాలనీకి చెందిన కాశ బోయిన భద్రి ఇంట్లో గురువారం పట్టపగలు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గురువారం మధ్యాహ్నం సుమారు 1 గంట నుండి 2 గంటల మధ్య సమయంలో వారి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు ఆరున్నర తులాల బంగారం, 35 తులాల వరకు వెండి, 10 వేల విలువగల టీవీ దొంగతనానికి గురైనట్లు తెలిపారు.

వరుస దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసు సిబ్బంది రాత్రి సమయాల్లో పహారా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement