Tuesday, October 8, 2024

KHM: పొంగులేటి స‌మ‌క్షంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరిక‌లు

ఇల్లందు : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఈరోజు ఇల్లందు మండలం రాగబోయినగూడెం సర్పంచ్ రాముతో పాటు పలువురు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అరాచక పాలన అందిస్తున్న బీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement