Monday, April 29, 2024

HYD: గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ థర్మకోల్ తయారీ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకున్నారు.

దాదాపు 6 ఫైరింజన్లతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. మరోవైపు దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి వుంది. ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement