Saturday, December 7, 2024

ADB: నాలుగు రోజుల్లో పెళ్లి.. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

కడెం, ఫిబ్రవరి 14 (ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లా కడెం చిన్న బెల్లాల్ లో పెండ్లి వరుడు కరెంట్ షాక్ తగిలి మృతిచెందడంతో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ఈనెల 18తేదీన ఆదివారం పెళ్లి కావలసిన పెళ్లి కొడుకు విద్యుత్ షాక్ తో మృతిచెందడంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన నీరాల వినోద్ (25) అనే యువకుడు తన ఇంట్లో బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వాటర్ హీటర్ తో విద్యుత్ షాక్ కు గురికాగా.. గమనించిన కుటుంబీకులు వినోద్ ను వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వినోద్ మార్గంమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వచ్చే ఆదివారం వినోద్ వివాహం ఉండగా పెళ్ళికొడుకు కాకముందే ఇలా వినోద్ మృతి చెందడంతో వారి కుటుంబంలో ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. కడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement