Tuesday, May 7, 2024

Breaking: ట‌మాటా ట్రేలో గంజాయి… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు

తెలంగాణ‌లోని న‌ల్గొండ జిల్లాలో గంజాయి మాఫియా సరికొత్త ట్రిక్ ఉప‌యోగించింది. పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి తరలించే స్కెచ్ వేస్తే… పోలీసుల నిఘాతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. 330 కిలోల (168 ప్యాకెట్లు) గంజాయిని ఓ డీసీఎం లో అక్రమంగా తరలిస్తుండ‌గా నాగార్జున సాగ‌ర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న‌లుగురు స‌భ్యుల ముఠా టమాటా ట్రే ల మధ్య గంజాయి దాచిపెట్టి మహారాష్ట్రకు తరలిస్తుండ‌గా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement